నరసరావుపేట: 'విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు' 'అమ్మేదెవరు కొనేదేవరు' అంటూ అఖిల పక్ష నాయకులు నినాదాలు చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అఖిల పక్ష నాయ కుల ఆధ్వర్యంలో స్థానిక పల్నాడు రోడ్డులోని జివిఆర్ గ్రాండ్ హోటల్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి రైతు సంఘం పల్నాడు జిల్లా కార్య దర్శి ఏపూరి గోపాలరావు అధ్యక్షత వహించారు. రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉక్కు పరి శ్రమ ఉద్యోగుల యూనియన్ (సిఐటియు) ప్రధాన కార్య దర్శి రామస్వామి మాట్లాడుతూ విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కాకుండా రాష్ట్ర ప్రజల సహకారంతో ఈ ఉద్య మాన్ని ముందుకు తీసుకువెళ్తామని, దీనికి రాజకీయ పార్టీ లు, ప్రజా సంఘాలు, ఉద్యోగులు, కార్మికులు, మేధావులు, రైతులు ప్రజల సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు. ఉక్కు పరిశ్రమను అమ్మేందుకు ప్రధాని మోడీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు రాజకీయ పార్టీలే కాకుం డా ప్రతి ఒక్క ఆంధ్రుడు ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ఉక్కు పరిశ్రమ అమ్మకంపై మోడీ మాట్లాడిన రోజునుండి నేటి వరకు ఉక్కు పరిశ్రమ ఉద్యోగులు కార్మికులు, నిర్వా సితులు పోరాట కమిటిగా ఏర్పడి 857 రోజులుగా పోరా టం చేస్తున్నామన్నారు. ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి రూ.4859 కోట్లు కాగా కార్మికుల కృషితో నేడు రూ.3 లక్షల కోట్లకు చేరిందన్నారు. ఉక్కు తయారీ సామర్థ్యం పెంచడం వలన కొత్తగా 10 వేల మంది యువ తకు ఉపాధి అవకాశాలు వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రజల ప్రాణ త్యాగంతో ఏర్పడిన ఉక్కు పరిశ్రమ అమ్మనీయ బోమని అన్నారు. ఉక్కు పరిశ్రమ అమ్మకానికి వ్యతిరేకంగా ఇప్పటివరకు ఉద్యమాలు, నిరసనలు చేసిన ప్రజా సం ఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఉక్కు పరిశ్రమ కార్మిక యూనియన్ ఎఐటియుసి అధ్యక్షులు జె.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతి పెద్ద పరిశ్రమ ఏడాదికి రూ.6 వేల కోట్లకు పైగా ఆర్థిక లోటును పూడుస్తుందన్నారు.ఉక్కు పరిశ్రమ ప్రభుత్వం రం గంలో కొనసాగిస్తామని ప్రకటించే వరకు పోరాటం కొన సాగుతుందన్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాలలో ఉక్కు పరిశ్రమపై ప్రకటించాలని డిమాండ్ చేశారు.
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, సిపిఎం పల్నాడు జిల్లా కార్య దర్శి గుంటూరు విజరు కుమార్ మాట్లాడుతూ బిజెపి దాని మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్, భారతదేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నాయని, ప్రభు త్వం రంగం అనగానే దాని ముద్దు పేరు 'బుక్ వాల్యూ 'అన్నట్లుగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నియంత పోక డలను వామపక్షాలు కూట మిగా ఏర్పడి ఎదుర్కొంటామని హెచ్చరించారు.ఆంధ్ర రాష్టంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఏ మాటలు చెప్పినా ఆచరణలో మాత్రం మోడీ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్నాయని విమర్శించారు. ప్రత్యక్షంగా టిడిపి, జనసేన, పరోక్షంగా వైసిపిలు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వారు కూడా విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చేసిన పోరాటంలో ప్రాణాలు అర్పించారన్నారు. ప్రభుత్వ రంగం అంటే ప్రజల ఆస్థి అని ప్రతి ఒక్కరూ గ్రహించి మరో రైతాంగ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఆనాడు కమ్యూనిస్టులు, యువజన సంఘాలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్ళుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని, ఎపిలో నిర్మించేందుకు ఎన్నో పోరా టాలు చేయాల్సి వచ్చిందని యువకుల ఆత్మ బలిదానాలు, వామ పక్షాలు, ఇండిపెండెంట్ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుల రాజీనామాలు చేశారని గుర్తుచేశారు. ఎలాంటి స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర, పరిశ్రమ సాధనలో బిజెపి, నరేంద్ర మోడీల కనీస చేయూతలేదన్నారు. సిపిఐ పల్నా డు జిల్లా కార్యదర్శి ఎ.మారుతీ వరప్రసాద్ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తుల అనుకూల వర్గాలు బిజెపి పెద్దల చేతిలో అత్యంత దారుణంగా ప్రజల ఆస్తి విశాఖ ఉక్కును బలి చేయడానికి రాష్ట్ర ప్రజానీకం ఒప్పుకునే పరిస్థితి లేద న్నారు. దీనిని ప్రజలు తీవ్రంగా పరిగణలో తీసుకోవాలని ఈ రాష్ట్రంలో బిజెపి కుయుక్తులు సాగకుండా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. 2023 సెప్టెంబర్ నాటికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ రద్దు చేయాలని, ఈ పోరాటానికి అన్ని తరగతుల ప్రజల మద్దతు కూడగట్టాలని ప్రజా బ్యాలెట్ నిర్వహించాలని నియోజకవర్గ మండల గ్రామస్థాయి కేంద్రాలలో విస్తతంగా ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం తీర్మానించింది.
సమావేశంలో సీనియర్ న్యాయవాది సిహెచ్. ప్రతాప్, కాంగ్రెస్ నాయకులు ఆర్కే నాయుడు, జై భీమ్ భారత్ పార్టీ జిల్లా నాయకులు గోదా జాన్ పాల్, ఎంఐఎం పార్టీ నాయకులు మస్తాన్వలి, మహిళా సంఘం నాయ కులు చెరుకుపల్లి నిర్మల, నాగమ్మ, సిపిఐ సిపిఎం ప్రజా సంఘాల నాయకులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము, అధ్యక్షులు తాళ్లూరు బాబురావు, రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్య క్షులు గుంటుపల్లి బాలకష్ణ, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు, సిఐటియు నాయకులు మస్తాన్ రెడ్డి, ఎఐటియుసి నాయకులు బూదాల శ్రీనివాస రావు, ఉప్పలపాటి రంగయ్య, వైదన వెంకట్, ఎఐవైఫ్ యువజన సంఘం నాయకులు రాజేంద్ర, షేక్ సుభాని ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ నాయకులు శ్రీనివాసరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ ఆంజనేయులు నాయక్, ఎల్‌ఐసి ఉద్యోగులు గౌసు, హుస్సేన్, వాగ్య నాయక్, ఆనంద్, సాయి, మహేష్ పాల్గొన్నారు.










