ప్రజాశక్తి - చీరాల : ఎందరో త్యాగమూర్తుల ఉద్యమాల ఫలితంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా సాధించుకున్నామని, ఆహక్కును కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కాలరాస్తూ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్.మజుందర్ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం స్థానిక బస్టాండ్ సెంటర్ వద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ పర్యవేక్షణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాలు సిఐటియు, సిపిఎం, సిపిఐ, టిడిపి, జనసేన, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మజుందర్ మాట్లాడుతూ విశాఖపట్నం ఆంధ్రుల హక్కు అని పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కారు చౌకగా విదేశీ కంపెనీ ఫోస్కోకు కారు చౌకగా అప్పజెప్పన బిజెపి ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. రూ 2 లక్షల కోట్లు విలువ చేసే కంపెనీని మూడున్నర వేల కోట్లకు కారుచౌకగా కట్టబెట్టడాన్ని ప్రజలు వ్యతిరేకించి వీధిలోకి వచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్ ప్రజా సంఘాలు ప్రజలు పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి వసంతరావు, సిపిఎం నాయకులు ఎం.బాబూరావు,కొండయ్య, సిపిఐ నాయకులు ఎం. వెంకట్రావు, టిడిపి నాయకులు గజవల్లి శ్రీనివాసరావు, కౌతరపు జనార్ధన్, జనసేన నాయకులు శివరాం ప్రసాద్, అన్నవరం దిలీప్ కుమార్ కాంగ్రెస్ నాయ కులు సయ్యద్ హలీం, వెంకటేశ్వర్లు, నారపరెడ్డి, సుబ్బారావు, అయ్యప్పరెడ్డి, హరిప్రసాద్ పాల్గొన్నారు .అద్దంకి : విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిపిఎం,టిడిపి, వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆర్‌టిసి బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు మండల కార్యదర్శి గుంజి వెంకట్రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కును కార్పొరేట్లకు కారు చౌకగా కట్టబెట్టాలని చూస్తుందన్నారు. ప్రజాసంఘాల నాయకులు మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ కార్మిక మహా ఉద్యమంలో నాడు 32 మంది బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం దుర్మార్గమని తెలిపారు. ఈ కార్యక్ర మంలో రావులపల్లి వెంకట్రావు, పరిటాల పవన్ కుమార్, సుధాకర్రావు, పి.ఆదాం, ఫ్రూట్ వెండర్స్ సభ్యులు రావులపల్లి కోటేశ్వరరావు సిపిఎం, తెలుగుదేశం, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కొల్లూరు : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్థానిక బస్టాప్ సెంటర్ వద్ద కార్మిక సంఘాలు,. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ నాయకులు బాబిరెడ్డి ప్రభాకర్, సిపిఎం మండల నాయకులు బొనిగల సుబ్బారావు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఎనిమిది వందల రోజులుగా విశాఖ స్టీల్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పోరాటం నిర్వహిస్తున్నప్పటికిని కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దుర్మార్గమని తెలిపారు. రేపల్లె : విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బస్టాండ్ సెంటర్‌లో కార్మికసంఘాలు, అఖిలపక్ష రాజకీయ పార్టీలు టిడిపి, సిపిఎం, సిపిఐ, జనసేన, జైభీమ్, సిపిఐ ఎంఎల్ ఆధ్వరయంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్. మణిలాల్, ఎఐటియుసి రాష్ట్ర నాయకులు పి.నాగాంజ నేయులు, టిడిపి పట్టణ నాయకులు జివి.నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షుడు ఆర్.మహేష్, సిపిఐ ఎంఎల్ నాయకులు ఎం.శోభరాణిలు ,జైభీమ్ పార్టీ బాపట్ల జిల్లా నాయకుడు పి.సుబ్బారావు మాట్లాడారు. మూడు లక్షల కోట్ల విలువ చేసే విశాఖఉక్కు పరిశ్రమను బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు 9,000 కోట్లకు అమ్మాలని చూస్తుందన్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణం విరమించు కోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు . ఎఐటియు, సిఐటియు నాయకులు జి.బాలాజీ, జి.రామారావు, డి.శంకర్, డి.రమేష్ రాంజీ, బి.మల్లి, ఎం.ఈశ్వరరావు, ఎం.ప్రసాద్, కె.ఆస్విరాదం, ఎస్.శివశంకర్, వై.నవీన్ పాల్గొన్నారు భట్టిప్రోలు : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. సిపిఎం, సిపిఐ, టిడిపి, కాంగ్రెస్, జనసేన పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు బారులు తీరి నిలిచాయి. ప్రయాణికులు ఇబ్బందులకు గురరయ్యారు. ఎస్‌ఐ అంబటి చంద్రశేఖర్ ఆందోళన కారులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి.కష్ణమోహన్, జి.సుధాకర్, ఎం. సత్యనారాయణ, నాగ మల్లేశ్వరరావు, సిపిఐ నాయకుడు బాలాజీ, టిడిపి నాయకులు టి.సాయిబాబా, కుక్కల వెంకటేశ్వరరావు, కాంగ్రెస్,జనసేన నాయకులు పాల్గొన్నారు. పంగులూరు : విశాఖ ఉక్కు ప్రైవేకటీకరణకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహి ంచారు. బస్టాండ్ సెంటర్‌లో వాహనాలు నిలిపి విశాఖ ఉక్కు పరిరక్షణకై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా నాయకుడు రాయిని వినోద్ బాబు, మండల కార్యదర్శి తలపనేని రామారావు, సిఐటియు మండల కార్యదర్శి గుడిపాటి మల్లారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తలపనేని సుబ్బారావు, అంకిరెడ్డి రంగారావు, బాచిన శ్రీనివాసరావు ,దాసరి సాల్మన్, బాచిన ఆంజనేయులు పాల్గొన్నారు చెరుకుపల్లి : విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు నిరసనగా స్థానిక ఐలాండ్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యకక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కె.శరత్, అఖిలపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. చిన్నగంజాం : విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా ఉద్యమించాలని సిఐటియు బాపట్ల జిల్లా కార్యదర్శి జి. ప్రతాప్ కుమార్ తెలిపారు. విశాఖ ఉక్కు ప్రవేటీకరణకు వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో పుల్లారావు, రమేష్, యాకోబు,కష్ణ, ఏసోబుపాల్గొన్నారు.










