ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : విశాఖ పరిపాలన రాజధానితో అధికంగా పెట్టుబడులు వస్తాయని, పారిశ్రామి కంగా ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. నవంబర్ 26, 27, 28వ తేదీల్లో స్థానిక లీ ప్యారడైజ్ లో జరగనున్న క్రెడాయి విజయనగరం ఛాప్టర్ వారి నాలుగో ప్రాపర్టీ ఎక్సోపోకు సంబంధించిన బ్రోచర్లను శనివారం ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కోలగట్ల..మీడియాతో మాట్లాడారు. విజయనగరం సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం రావడం వల్ల ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుతం నగరంలో అపార్ట్మెంట్ కల్చర్ పెరుగుతోందని, అందుకు తగ్గట్టుగా మంచి నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. వివిధ సంస్థలు ఒకే వేదిక మీదకు వచ్చే ఎక్సోపో- 23 వంద శాతం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్రెడారు రాష్ట్ర ఉపాధ్యక్షులు బోస్, జిల్లా చైర్మన్ పార్థసారథి, అధ్యక్షులు సూర్యనారాయణ రాజు, కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.










