ప్రజాశక్తి - కోటనందూరు
: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో విశాఖపట్నంలో నుండి పరిపాలన సాగిస్తారని రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. తుని లో గురువారం సాయంత్రం పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం నీ ఆధునికంగా తీర్చిదిద్ది దేశంలోనే ఐదవ స్మార్ట్ సిటీగా తయారు చేస్తామని అన్నారు. జగన్ విశాఖపట్నం షిఫ్ట్ అవడంతో ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకుల్లో గుబులు మొదలైందని కింజరపు రామ్మోహన్‌రావు మతి కోల్పోయి జగన్‌పై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని మంత్రి రాజా హెచ్చరిం చారు. నందమూరి కుటుంబాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబునాయుడే అన్నారు. చంద్ర బాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తల్లి అన్నపూర్ణ చనిపోతే తల్లి అంత్యక్రియలకు వెళితే ప్రజల్లో సానుభూతి వస్తుందా వెళ్లకపోతే వస్తుందా తల్లి అంత్య క్రియలు కూడా వెళ్ళకుండా ప్రజల కోసం పరిపాలన అంది స్తారని నమ్మించే ఉద్దేశంతో అతను అనుచరు లతో గెస్ట్ హౌస్‌లో సమావేశాన్ని ఏర్పాటు చేసిన దుర్మార్గుడని అన్నారు. 2024లో జరిగే ఎన్నికల్లో ఎలాగైనా ప్రజలను మభ్యపెట్టి గెలవాలని లేనిపోని హామీలను చెప్తూ ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతునారని, చంద్ర బాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు తిప్పి కొడతారని అన్నారు.2000 నోట్లు రిజర్వ్ బ్యాంకు గత మూడేళ్ల నుండి ముద్రించడం మానేసిందని, గతంలో ముద్రించిన 2000 నోట్లన్నీ రానున్న ఎన్నికల్లో పంచడానికి తన పార్టీ కార్యాలయంలో దాచుకున్నారని మంత్రి రాజా ఆరోపించారు.
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి రాజా










