Aug 07,2021 13:35

ప్రజాశక్తి-కలెక్టరేట్ : జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఆస్తి విలువ ఆధారంగా ఇళ్ల పన్నులు పెంపుదలను ఆమోదిస్తూ కౌన్సిల్లో మెజారిటీగా ఉన్న వైసిపి కార్పొరేటర్లు ఆమోదించారు. ఈ సమాచారం అందడంతో జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వెలుపల అప్పటికే నిరసన తెలుపుతున్న సిపిఎం, సిపిఐ, టిడిపి నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా  కార్యాలయం ముట్టడించడానికి లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేసారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ పర్వానికి తెర తీశారు. అరెస్టయిన వారిలో టిడిపికి చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, పీలా గోవింద సత్యనారాయణ, సిపిఎం నగర నాయకులు ఎం జగ్గు నాయుడు, ఆర్ కె ఎస్ వి కుమార్ ,బి జగన్,పి మణి, మాజీ కార్పోరేటర్ బొట్టా ఈశ్వరమ్మ,బి వెంకటరావు, జి అప్పలరాజు, వై రాజు, ఎం సుబ్బారావు, సిపిఐ నాయకులు ఎం పైడిరాజు, ఎస్ కె రెహమాన్, పి చంద్రశేఖర్,అమర్  లు ఉన్నారు. వీరితో పాటు మరో 100 మందిని అరెస్ట్ చేసి త్రీ టౌన్ స్టేషన్ కు తరలించారు. 

విశాఖ కౌన్సిల్ లో ఆస్తిపన్ను జీవో ఆమోదంతో నిరసన - 100 మంది పైగా అరెస్ట్ 