ఓరియంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎయు ప్రొఫెసర్ కిశోర్‌బాబు
ప్రజాశక్తి- వేపగుంట : విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయు కెమిస్ట్రీ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ కిషోర్‌బాబు మాట్లాడుతూ విద్యార్థులంతా ప్రథమ సంవత్సరంలోనే ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని దానికి అనుగుణంగా చదవాలన్నారు. ప్రాక్టికల్ నాలెడ్డ్‌తోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీధర్, పట్నాయక్ ఉదరు భాస్కర్ పాల్గొన్నారు










