Dec 15,2022 00:12

ఉత్పత్తులు ప్రదర్శిస్తున్న నేతలు

ప్రజాశక్తి-మాడుగుల: మండల కేంద్రంలో ఇటీవల ఏర్పాటు చేసిన వైయస్సార్‌ మహిళా మార్ట్‌లో విశాఖ డెయిరీ ఉత్పత్తులు విక్రయించనున్నట్టు ఎంపీపీ వేమవరపు పెదబాబు తెలిపారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా మార్ట్‌లో డెయిరీ ఉత్పత్తులు పాలు, పెరుగు, పన్నీర్‌తో పాటు ఇతర అన్ని రకాల ఉత్పత్తులు త్వరలో విక్రయం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కళావతి, బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, కుక్కర శ్రీధర్‌, ఎడ్ల హేమంత్‌, ఎం.అశోక్‌, వెలుగు ఎపిఎం అప్పల నరసమ్మ, సిబ్బంది సోమేశ్వరరావు, దంగేటి ప్రసాద్‌ పాల్గొన్నారు.