
ప్రజాశక్తి-విశాఖ లీగల్ : హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం సాయంత్రం విశాఖ చేరుకున్నారు. న్యాయమూర్తికి విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు చింతపల్లి రాంబాబు, ప్రధాన కార్యదర్శి పైలా శ్రీనివాసు, ఉపాధ్యక్షులు బిఎస్ లత, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు బైపా అరుణ్‌కుమార్ తదితరులు స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయం నుంచి పోర్టు వసతి గృహానికి ధీరజ్‌సింగ్ ఠాకూర్ చేరుకున్నారు. న్యాయమూర్తి ఆదివారం ఉదయం 10:30 గంటలకు విశాఖలో నూతనంగా నిర్మించిన పది న్యాయస్థానాల సముదాయాన్ని ప్రారంభిస్తారు. న్యాయమూర్తితో పాటు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ యు.దుర్గాప్రసాద్, జస్టిస్ డివిఎస్ సోమయాజులు, జస్టిస్ చీమలపాటి రవి, జస్టిస్ చీకటి మానవేంద్రరారు, ప్రభుత్వ కార్యదర్శి జవహర్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.