ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 13న జరగనున్న ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు కర్నూలు నుంచి బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాయని సహాయ రిటర్నింగ్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి తెలిపారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలకు బ్యాలెట్ పేపర్లు పంపించామని పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వెరిఫికేషన్ చేస్తామని తెలిపారు.