సింహాద్రిపురం : మండలంలోని అంకాలమ్మ గూడూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అన్నా చెల్లెలును పాము కాటు వేసింది. ఈ సంఘటనలో అన్న మృతి చెందాగా చెల్లెలు ఆస్పత్రిలో చికిత్స పొం దుతోంది. వివరాలు.. గ్రామానికి చెందిన రామాంజనేయులు, అనురాధ దంపతులకు కుమారుడు నవదీప్ (12), కుమార్తె భవ్యశ్రీ ఉన్నారు. మంగ ళవారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న అన్నా చెల్లెలను పాము కాటేసింది. తల్లిద ండ్రులు, బంధువులు గుర్తించి ఇద్దరిని పులివెందుల ఏరియా ఆస్పత్రికి తరలించారు. నవదీప్ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. భవ్యశ్రీ పరిస్థితి విషమంగా ఉండడంతో కడపకు రెఫర్ చేశారు. అభంశుభం తెలియని చిన్నారులను పాము కాటేయడంaతో అంకాలమ్మ గూడూ రులో విషాదఛాయలు అలుము కున్నాయి. రాత్రి నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురై కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలవించారు. చిన్నారుల తండ్రి రామాంజనేయులు తొండూరు పోలీస్‌స్టేషన్‌లో హోమ్‌గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు.










