Aug 09,2023 00:41

మృతి చెందిన పశువులు


ప్రజాశక్తి -కొత్తకోట:రావికమతం మండలం దొండపూడి గ్రామంలో మూగ జీవులపై విషప్రయోగం చేశారు. దీంతో ఓ రైతుకు చెందిన దుక్కిటెద్దు, ఆవు దూడ సోమవారం రాత్రి మృతి చెందాయి. సదరు రైతుకు రూ.లక్ష పైగా నష్టం వాటిల్లింది. ఎవ్వరో విషప్రయోగం చేసి తన జీవనా ధారమైన పశువులను చంపేశారంటూ గ్రామానికి చెందిన గడ్డి రాజునాయుడు కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. రాజునాయుడు ఇటీవలే రూ. లక్షా 10 వేలు వెచ్చించి జత దుక్కిటెడ్లును కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ముమ్మర వ్యవసాయ పనుల్లో ఉన్నాడు. దుక్కిటెడ్లులో ఒక ఎద్దుకు రెండు రోజులుగా ఆరోగ్యం బాగలేక పోవడంతో వైద్యం చేయిస్తున్నాడు. సోమవారం సాయంత్రం ఎప్పటి మాదిరిగా ఎడ్లుకు, దూడకు గోలెంలో దాణా వేసి మేపిన కాసేపటికే మృతి చెందాయి.దీంతో రాజు నాయుడు రోదిస్తూ సొమ్మసిల్లి పడిపోయాడు. ''సమీప రైతులు గమనించి రాజునాయుడుకు సపర్యలు చేశారు. గోలెంను పరిశీలించగా. అందులో విషం కలిపినట్టుగా తెలిసింది.పోలీసులు సంఘటణా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తకోట ఎస్‌ఐ విభూషణరావు తెలిపారు.