Sep 12,2023 01:17

జృంభించడంతో గిరిజనులు


ప్రజాశక్తి -అరకులోయ రూరల్‌:విషజ్వరాలు విజృంభించడంతో గిరిజనులు వణికి పోతున్నారు. వైద్య సేవలు అందక రోగులు ఇంటింటా మంచం పట్టిన దుస్థితి మండలంలోని బస్కి పంచాయితీ బిజగూడ గ్రామంలో నెలకొంది. నెల రోజులుగా ఆ గ్రామంలో విషజ్వరాలు వ్యాపించడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వైద్య అధికారులు కనీసం స్పందించకపోవడం దారుణం.
బిజగూడ గ్రామంలో గ్రామంలో సుమారు 35 గిరిజన పివిటిజి కుటుంబాలు జీవిస్తున్నారు. కలుషిత నీరు తాగడం, గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగు నీరు ఎక్కడకక్కడే నిలిచి పోవడంతో దోమలు బెడద ఎక్కువైంది.దీంతోనే, మలేరియా వంటి వ్యాధులు వస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఇంట్లో ఇద్దరు ముగ్గరు చిన్న పిల్లలతో సహా తల నొప్పులు, జ్వరం, కాళ్లువాపు, ముఖం వాపు రావడం వంటి వ్యాధి లక్షణాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మండలంలోని బస్కి పంచాయితి బిజగుడ గ్రామంలో మంచి తాగు నీరు సమస్య తీవ్రంగా ఉంది. గతంతో ఊట గడ్డ నుండి గ్రావిగ్‌ స్కీంతో మంచి నీరు ట్యాంక్‌ నిర్మించారు. ప్రస్తుతం ట్యాంక్‌ పూర్తిగా శిధిలావస్థలో చేరడంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి పూర్తిగా బురద నీరు ట్యాంక్లో చేరుతుంది. దీంతో, నీరు కలుషిత అవుతుంది. గ్రామంలో మంచినీరు లేక ఆ కలుషితమై నీరు తాగి అనారోగ్యాలు పాలవుతున్నామని గ్రామస్తులు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి గ్రావిటి పథకం మరమ్మతు చేపట్టి మంచినీరు అందించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.
వ్యాధుల బారిన పడిన వారిలో కిల్లో సల్పు(50), కిల్లో కొండమ్మ(45), కిల్లో డుంబ్రి (45), కీల్లో సుత్తి (46), కిల్లో భాస్కరరావు (26), కిల్లో సుబ్బారావు( 22), కొర్ర సన్యాసిరావు (38), కిల్లో మసురు( 40), కిల్లో శివ (10), కిల్లో అనూష (18), కిల్లో కుసుమ( 70),క

ిల్లో ఈశ్వరరావు (28). కిల్లో సీతమ్మ (28), కిల్లో దీక్షిత (4), కిల్లో దేవి( 25), జి యశ్వంత్‌ (3), కిల్లో ఉంబ్రు (52), కిల్లో రూతు (3),యోహాన్‌ (8), మరో ఇద్దరు కిల్లో లక్ష్మి,(48) సొడేపల్లి గాసి అరకు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రతి ఇంటిలో ఒకరు ఇద్దరు చొప్పున జ్వరాలతో బాధప డుతున్నారు. వైద్య అధికారులు చొరవ చూపి గ్రామాల్లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య సేవలు మందులు పంపిణీ చేయాలని గిరిజనులు కోరుతున్నారు.