Mar 08,2023 19:45

మృతి చెందిన బర్రె

విష గుళికలు తిని గేదె మృతి
- మరొక గేదెకు అస్వస్థత

ప్రజాశక్తి - చాగలమర్రి

మండల కేంద్రమైన చాగలమర్రిలోని పాత బస్టాండ్‌ వీధికి,పసుపుల శ్రీనివాసులు చెందిన బర్రె విష గులిగిల ఆహారం తిని ఒకటి మృతి చెందగా మరొకటి తీవ్రస్వస్థకు గురి అయింది. పశువుల యజమాని శ్రీనివాసులు వివరాల మేరకు బుధవారం ఉదయం మేత మేషందుకు వెళ్లి అడ్డవాగు సమీపంలోని పొలంలో తెగుళ్ల నివారణ కోసం వాడిన విషపు గుళికలు వేసిన మొక్కజొన్న పంటను తిని పాడి గేదే అక్కడికక్కడే మృతి చెందగా మరో గేదే తీవ్ర అస్వస్థతకు గురైంది. పశువు యజమాని సుమారు రూ.1,50,000 వరకు నష్టం వాటిలినట్టు బాధితులు తెలిపారు. అస్వస్థకు గురైన పశువుకు చికిత్సలు చేసి ప్రాణాపాయం నుండి కాపాడారు. పశువుల బీమాను వర్తింప చేసి ఆదుకోవాలని బాధితులు కోరారు.