Aug 12,2023 20:08

రక్తదాత విరుపాక్షిని సన్మానిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఆదోని
విరుపాక్షి సేవలు ప్రశంసనీయమని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి హరి ప్రసాద్‌ యాదవ్‌ కొనియాడారు. శనివారం అనంతపురం జిల్లా గుంతకల్‌ పట్టణంలో జెవివి ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. సినీ గేయ రచయిత జయరాజు విరుపాక్షి స్వామిని సన్మానించారు. ఆదోని పట్టణంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో రక్తదానం చేసి ప్రాణం పోసే సంజీవినిలా పనిచేస్తున్నారని ప్రశంసించారు. కరోనా సమయంలో పేదలకు విశిష్ట సేవలు అందించిన వారిని సన్మానించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భరత్‌, హరి, నాగరాజు పాల్గొన్నారు.