Aug 21,2023 19:58

మాట్లాడుతున్న సిపిఎం నాయకులు జివిబి కుమార్‌

ప్రజాశక్తి-కందుకూరు :సెప్టెంబర్‌లో నిర్వహించ తలపెట్టిన జీ-20 దేశాల సమ్మిట్‌ నేపథ్యంలో ప్రజా సంఘాలు, ఆర్థిక వేత్తలు, రాజకీయ వేత్తలు, మేధావులతో కలిసి ఢిల్లీలోని సూర్జీత్‌ భవన్‌లో (సిపిఎం కార్యాలయంలో) నిర్వహించ తలపెట్టిన విరు-20 పీపుల్స్‌ సమ్మిట్‌ను బిజెపి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఆఫీస్‌ గేట్లకు తాళాలు వేసి అడ్డుకోవడం దుర్మార్గ మైన చర్య అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఢిల్లీలో విరు -20 సదస్సును అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సోమవారం వలేటివారిపాలెంలోని బిసి హాస్టల్‌ వద్ద సిపిఎం వలేటివారిపాలెం మండల కమిటీ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఎం వలేటివారిపాలెం మండల కార్యదర్శి మాదాల రమణయ్య అధ్యక్షత వహించారు. సమావేశంలో సిపిఎం మండల ఇన్‌ఛార్జి జివిబి కుమార్‌, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి భూసి సురేష్‌ బాబు,టిడిపి మండల నాయకులు, మాజీ ఎంపీటీసీ వలేటి నరసింహం, అభ్యుదయ వాది మర్రి అంజయ్య, రాళ్లపాడు పరిరక్షణ రైతు కూలి సంఘం నాయకులు మిట్టనోసల సుభాను, సిఐటియు మండల కార్యదర్శి సాదు చెన్నకేశవులు, కెవిపిఎస్‌ నాయకులు హరి తదితరులు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా సూర్జిత్‌ భవన్‌ కు తాళాలు వేసి,పోలీసు బలగాలతో సదస్సును అడ్డుకోవడం దుర్మార్గమనాన్రు. ఇటువంటి హేయమైన చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని సూచించారు. రైతు నాయకులు మానికొండ మదన్‌ పాల్గొన్నారు.