
ఇంధ్ర ధనస్సు ఉన్న దృశ్యం
విరిసిన అందాల హరివిల్లు..
-తన్మయం చెందిన ప్రజలు
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు:ఆకాశంలో విరిసిన హరివిల్లు అపురూప దశ్యం ప్రజలను తన్మయ పరిచింది. మంగళవారం వినీల గగనతలంలో విరిసిన ఈ ఇంద్రధనస్సు మండలంలోని తోటపల్లి పంచాయతీ కామాక్షినగర్ ప్రాంతంలో కనువిందు చేసింది. ఈ అపురూప దశ్యాన్ని ఫెల్లోషిప్ చర్చ్ ఆఫ్ గా డ్ సంస్థ చైర్మన్ కుందవరం బాబి ఇమ్మానుయే ల్ తన కెమెరాలో బంధించారు. నీటి బిందువు లపై కాంతి పరావర్తనం, వక్రీభవనం ద్వారా ఇం ద్రధనస్సు సంబవిస్తుందని సైన్స్ చెబుతోంది. ఇది ఆకాశంలో ఏడు రంగురంగుల చాపం రూపం లో ఉంటుంది. మొదటి రకం ఇంద్ర ధను స్సు పరిపూర్ణ అంతఃపరావర్తనం ద్వారా జరిగి తే, ద్వితీయ ఇంద్రధనుస్సు వాతా వరణంలోని నీటి బిందువుల్లో రెండుమార్లు పరావర్తనం అవ టం వల్ల తయారవుతుంది. ఏదేమైనా ఓ వైపు వర్షం, మరోవైపు గగనతలంలో విరిసిన అంద మైన హరివిల్లు అపురూప దశ్యం ప్రజలకు ఒకింత సేపు కనువిందు చేసింది.