Jun 29,2023 19:17

విరాళం అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కందుకూరు :అంకమ్మ తల్లిదేవాలయ పునర్‌నిర్మాణం ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి, భక్తుల సంకల్పంతో శరవేగంగా పూర్తి కావస్తోంది. ఎంఎల్‌ఎ కార్యాలయంలో శుక్రవారం అమ్మవారికి కావలికి చెందిన దొడ్ల మనోహర్‌ రెడ్డి ధర్మపత్ని ప్రవీణ మ్మ 1 గ్రాము బంగారం అందజేశారు. వి ఆర్‌ కోటకు చెందిన వంకాయలపాటి శ్రీని వాసులు ధర్మపత్ని రవణమ్మ 2 గ్రాముల బంగారం విలువ చేసే నగదును రూ12,501 అందజేశారు. కొండ సముద్రం గ్రామానికి చెందిన మన్నెం వెంకట రమేష్‌ ధర్మపత్ని వెంగమ్మ గ్రామ బంగారం విలువ చేసే నగదు రూ6,250 అందజేశారు. వారందరికీ ఎంఎల్‌ఎ మహీధర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తోకల కొండయ్య , మాల కొండయ్య ,పబ్బిశెట్టి శివ పాల్గొన్నారు.