విరాళం ఇస్తున్న దాత
ప్రజాశక్తి-కందుకూరు : పట్టణ గ్రామ దేవత అంకమ్మ తల్లి దేవాలయం పున: నిర్మాణంలో భాగంగా కందుకూరుకు చెందిన పరిమి తిరుపతమ్మ వారి కుమారులు నాగేంద్రబాబు, రఘురామ్ రూ 31,116 నగదును ఆలయ ప్రాంగణంలో పునర్నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్ రెడ్డి పిలుపుమేరకు ఇప్పటివరకు అంకమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎనిమిరెడ్డి వెంకటరెడ్డి, ఆవుల మాధవరావు, మాదాల మాల్యాద్రి పాల్గొన్నారు.










