Sep 11,2023 18:58

విరాళం ఇస్తున్న దాత

ప్రజాశక్తి-కందుకూరు :అంకమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట ఈనెల 7వ తేదీన ఎంతో వైభవంగా జరిగింది. శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం మొదటి దశ పూర్తి చేసుకొని, రెండో దశ పనులు ప్రారంభించబోతున్నారు. భక్తులు తమ వంతు విరాళం, ఆలయ నిర్మాణానికి, సువర్ణ మకర తోరణానికి అందజేస్తున్నారు. సోమవారం బక్కముంతల పెద్ద మాలకొండయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు నాగరాజు భార్య ప్రభావతి రూ 25116 విరాళాన్ని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఎనిమిరెడ్డి వెంకటరెడ్డి కి అందజేశారు. నిర్మాణ కమిటీ సభ్యులు మాట్లాడుతూ అమ్మవారి ఆలయ నిర్మాణానికి భక్తుల స్పందన ఎంతో అద్భుతంగా ఉందని, భక్తులు ఊహించిన దాని కంటే ఆలయం అత్యద్భుతంగా నిర్మితమైందన్నారు. నిర్మాణ కమిటీ సభ్యులు షోరూం వేణుగోపాల్‌ రెడ్డి, కొడాలి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.