Aug 26,2023 19:23

విరాళం అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కందుకూరు : అంకమ్మ తల్లి దేవస్థానం పునర్‌ నిర్మాణం కోసం ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌ రెడ్డి కృషి చేస్తున్నారు. సెప్టెంబర్‌ 7న తేదీన అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. శనివారం ఎంఎల్‌ఎ ఆఫీస్‌లో ఎంఎల్‌ఎ మహీధర్‌ రెడ్డి సమక్షంలో తోకల కష్ణారావు భార్య నిర్మల రూ 25,116, కట్టా శ్రీనివాసులు భార్య బాల నాగమణి రూ 5,116లు,అలాగే రాజా భవీన్‌ రూ 5,116 విరాళం అందజేశారు. ఎంఎల్‌ఎ వారికి అభినందనలు తెలిపారు.