విరాళాలు ఇస్తున్న దాతలు
ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు పట్టణం గ్రామదేవత అంకమ్మ తల్లి దేవాలయం పున: నిర్మాణం లో భాగంగా ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్ రెడ్డి పిలుపుమేరకు భక్తులు విరాళాలను సమర్పిస్తున్నారు. సోమవారం నాగినేని ఈశ్వర వర ప్రసాదరావు భార్య ఉమామహేశ్వరి రూ 50,116 నగదును కమిటీ సభ్యులు కొడాలి కోటేశ్వరరావు, విశ్రాంత ఎంపిడిఒలు మద్దిరాల వెంకటేశ్వర్లు, కోవూరు మాల కొండయ్య,పిడికిటి వెంకటేశ్వర్లు లకు సమర్పించారు. సాదినేని మనోహర్ భార్య సుకన్య రూ 6250 లు, సాధినేని సుధీర్ కుమార్ భార్య దివ్య రూ 6,250 లు,కొల్లూరి సుబ్బ రాములు భార్య వెంకట రమణమ్మ రూ 31,116 లు, పోనూరు శ్రీనివాసరెడ్డి ధర్మపత్ని అనుపమ రూ 5,116 లను సమర్పించారు.










