విరాళాలు ఇస్తున్న దాతలు
ప్రజాశక్తి-కందుకూరు :శ్రీ అంకమ్మ తల్లి దేవస్థానం పునర్నిర్మాణం కోసం శాసనసభ సభ్యులు మాను గుంట మహీధర్ రెడ్డి అంకమ్మ తల్లి భక్తులు కలిసి ప్రతిష్టాత్మకంగా సెప్టెంబర్ 7వ తేదీన అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా అమ్మవారి పాదాల చెంత ఏర్పాటు చేసే సువర్ణ యంత్రం కోసం కూరపాటి లక్ష్మీనారాయణరెడ్డి, భార్య సునీత గ్రామ బంగారం కోసం నగదు 6,250 అమ్మవారికి భక్తితో కానుకగా సమర్పించారు. ఆవుల మాధవరావు, కొడాలి కోటేశ్వర రావు, కోవూర మాలకొండయ్య, మాదాల మల్యాద్రి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.










