Oct 12,2022 23:42

వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు

సిపిఎం నాయకులు నాగేశ్వరరావు, సీతారామయ్య
ప్రజాశక్తి-విఆర్‌.పురం

జులై నెలలో వచ్చిన వరదలకు గ్రామాలు నీట మునిగి ఇళ్లు కూలిపోయి, రోడ్లు, వీధుల్లో బురద పేరుకుపోయి దుర్వాసన వస్తున్నా ప్రభుత్వం విపత్తులు నిధులను కేటాయించకపోవటం దారుణమని సిపిఎం నాయకులు పేర్కొన్నారు. బుధవారం కూనవరం సచివాలయంలో పంచాయతీ ఇఒకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మేకల నాగేశ్వరరావు, మండల కార్యదర్శి పాయం సీతారామయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు కేటాయించిన 14, 15 ఆర్థిక సంఘాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ బిల్లులకు పేరుతో లాగేసుకుందని తెలిపారు. దీంతో పంచాయతీల్లో పారిశుధ్య నిర్వహణ వంటి కనీసంగా పనులు చేయలేని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. తక్షణమే నిధులు మంజూరు చేసి అభివద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టాలని డిమాండ్‌ చేశారు. 14, 15 ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన ఫలితంగా కనీసం సర్పంచులకు గౌరవ వేతనం కూడా తీసుకోలేని దుస్థితిలో పంచాయతీ సర్పంచులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలకు నిధులు రాక అభివద్ధి కుంటిబడిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన నిధులను వెంటనే విడుదల చేయకపొతే దశల వారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు పాయం సత్యనారాయణ, షణ్ముఖరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.