ప్రజాశక్తి-యంత్రాంగం మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్థంతి సందర్భంగా పలుచోట్ల ఆదివారం ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. కాకినాడ నాగమల్లి తోట జంక్షన్ వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి ఘన నివాళులర్పించారు. పంపన దయానంద బాబు, కర్రి అచ్యుతరెడ్డి పాల్గొన్నారు. ఇంద్రపాలెం అల్లూరి సెంటర్ వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి డివైఎఫ్‌ఐ అధ్యక్షులు చిట్టూరి సాహిత్, రామ్మోహన్ నివాళులర్పించారు. చిట్టూరి విజరు కుమార్, వాసు, గవర బాబ్జీ, చంద్రరావు, శృతి, సరిత, రోహిత్, కీర్తన, కీర్తి, అర్పిత, జగత్, వినీత్, ప్రణీత, మోక్షిత, లంక విజయకృష్ణ పాల్గొన్నారు. సర్పవరం జంక్షన్‌లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. నగేష్, అడబాల రత్న ప్రసాద్, చింతపల్లి సుబ్బారావు, రాజా, ఉంగరాల వెంకటేశ్వరరావు, రేలంగి బాపిరాజు పాల్గొన్నారు. సామర్లకోట బళ్ల మార్కెట్ సెంటర్‌లో డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కరణం ప్రసాదరావు మాట్లాడారు. ఎస్.యువరాజు, దారబాని కృష్ణ, చల్లా మహేష్, సింహా చలం,కరణం ఏడుకొండలు, బత్తుల బాలాజీ పాల్గొన్నారు. ఏలేశ్వరం సిపిఎం మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు నివాళి అర్పించారు. పిల్ల రాంబాబు, పెద్దపాటి గురయమ్మ, రేఖ అమ్మాజీ, ఉగ్గిన రామం, బత్తుల వీరబాబు, గుండుబిల్లి చక్రం, బర్రె నూకరాజు, రౌతు సత్యనారాయణ ఉన్నారు. పెద్దాపురం వరహాలయ్యపేటలోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు, ముప్పన వీర్రాజు, సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు జోష్యుల కష్ణ బాబు, కూనిరెడ్డి అరుణ, పెద్దింటి సీతన్న, గరగపాటి పెంటయ్య, కేదారి నాగు, సిరపరపు శ్రీనివాస్, క్రాంతి కుమార్, నీలపాల సూరిబాబు పాల్గొన్నారు.










