Oct 09,2023 20:49

చే గువేరా చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

రాజంపేట అర్బన్‌ : ఎగిసే విప్లవ కెరటం చేగువేరా అని, యువత ఆయనని ఆదర్శంగా తీసుకోవాలని, విభజన హామీల అమలు కోసం యువత చే స్ఫూర్తితో పోరాటాలలో భాగస్వామ్యం అవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఉపేంద్ర అన్నారు. సోమవారం చేగు వేరా వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు అమెరికా సామ్రాజ్యవాదనికి ఎదురోడ్డి, క్యూబా పోరాటంలో కీలకపాత్ర పోషించిన వీరుడు చేగువేర అన్నారు. డాక్టర్‌ వత్తిలో వుండి పేదల కోసం అహర్నిశలు కష్టపడి గెరిల్లా పోరాట ఉద్యమాలు నిర్వహించి సామ్రాజ్య వాదుల చేతిలో వీరమరణం పొందాడని తెలిపారు. చేగువేరని అందరూ చే అని పిలుస్తా రన్నారు. 1967, అక్టోబర్‌ 9న అమెరికా సామ్రా జ్యవాదుల చేతిలో వీర మరణం పొందాడని పేర్కొన్నారు. ప్రస్తుతం యువతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా వాడు కుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమను విస్మరించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని రాష్ట్ర హక్కుల కోసం మోడీ దగ్గర తాకట్టు పెట్టిందన్నారు. మతోన్మాదం పేరుతో దేశంలో అణగారిన వర్గాల పై దాడులు, అత్యా చారాలు ఎక్కువ అయ్యాయని పేర్కొన్నారు. యువత హక్కుల కోసం పోరాడటానికి ముం దుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ కళాశాల కమిటీ సభ్యులు గోవర్దన్‌, హరి, అంజి పాల్గొన్నారు.