కడప అర్బన్ : ఎగిసే విప్లవ కెరటం చేగువేరా అని, యువత ఆయనని ఆదర్శంగా తీసుకోవాలని, విభజన హామీల అమలు కోసం కడప ఉక్కు కోసం యువత చే స్ఫూర్తితో పోరా టాలలో భాగస్వామ్యం అవ్వాలని డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం చిన్ని, వీరనాల శివకు మార్ తెలిపారు. సోమవారం చేగు వేరా వర్ధంతి సందర్భంగా కడప ఐటిఐ కాలేజీలో చే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాడు అమెరికా సామ్రాజ్యవాదనికి ఎదురోడ్డి, క్యూబా పోరాటంలో కీలకపాత్ర పోషించిన వీరుడు చేగువేర అన్నారు. డాక్టర్ వత్తిలో వుండి పేదల కోసం అహర్నిశలు కష్టపడి గెరిల్లా పోరాట ఉద్యమాలు నిర్వహించి సామ్రాజ్య వాదుల చేతిలో వీరమరణం పొందాడని తెలిపారు. చేగువేరని అందరూ చే అని పిలుస్తా రన్నారు. 1967, అక్టోబర్ 9న అమెరికా సామ్రా జ్యవాదుల చేతిలో వీర మరణం పొందాడని పేర్కొన్నారు. ప్రస్తుతం యువతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా వాడు కుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం బిజెపి ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమను విస్మరించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని రాష్ట్ర హక్కుల కోసం మోడీ దగ్గర తాకట్టు పెట్టిందన్నారు. మతోన్మాదం పేరుతో దేశంలో అణగారిన వర్గాల పై దాడులు, అత్యా చారాలు ఎక్కువ అయ్యాయని పేర్కొన్నారు. యువత హక్కుల కోసం పోరాడటానికి ముం దుకు రావాలన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నగర అధ్యక్షులు షాకీర్,కార్యదర్శి డి.ఎం. ఓబులేసు పాల్గొన్నారు. బ్రహ్మంగారిమఠం: ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు గండి సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో చే గువేరా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండలశాఖ అధ్యక్షులు కలివేరు రాజశేఖర్, సహాయ కార్యదర్శి దేవకుమార్, సుధాకర్, తేజ, వర్మ పాల్గొన్నారు. జమ్మలమడుగు : చేగువేరా స్ఫూర్తితో విభజన హామీల అమలు కోసం, విద్యా రంగ అభివృద్ధి కోసం పోరాటాల్లో భాగస్వామ్యం అవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు వినరుకుమార్ కోరారు. చేగువేరా వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి, సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అనిల్, సురేష్, బాబు, క్రిష్టపర్, జాన్, మహ్మద్, అశ్వర్థ్ పాల్గొన్నారు. ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్) : చేగువేరా వర్ధంతి సందర్భంగా స్థానిక శ్రీవిద్య జూనియర్ కళాశాలలో డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. చేగువేరా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు డేవిడ్‌రాజ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు వినరుకుమార్, విద్యార్థులు పాల్గొన్నారు.చే గువేరా చిత్రపటానికి నివాళులర్పిస్తున్న డివైఎఫ్‌ఐ నాయకులు










