మాట్లాడుతున్న ధనలక్ష్మి
ప్రజాశక్తి-బాపట్ల: వివోఏల సమస్యల పరిష్కారానికి ఈ నెల 5న జిల్లా పిడి కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని విఓవోఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి పిలుపునిచ్చారు. గురువారం బాపట్ల సిఐటియు కార్యాలయంలో వివోఏల జిల్లా సమావేశంలో ఆమె మాట్లాడారు. సమావేశానికి టి పుణ్యలక్ష్మి అధ్యక్షత వహించారు. ధనలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో 28 వేల మంది వెలుగులో పనిచేస్తున్న వివోఏలకు మూడేళ్ల కాలపరిమితి జీవని వెంటనే రద్దు చేయాలన్నారు. వివోఏలకు హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. వివోఏలకు సంబంధం లేని పనులను చేయించరాదన్నారు. సమావేశంలో యూనియన్ నాయకులు జ్యోతి కృష్ణకుమారి, శ్రీలక్ష్మి, చిట్టెమ్మ, పద్మ సిఐటియు నాయకులు సిహెచ్ మజుందార్, జె శామ్యూల్ పాల్గొన్నారు.










