ప్రజాశక్తి - మంత్రాలయం
వైకెపి విఒఎల సమస్యలను పరిష్కరించాలని సంఘం జిల్లా అధ్యక్షులు బసవరాజు కోరారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో మండల గౌరవాధ్యక్షులు ఈశ్వర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా బసవరాజు హాజరయి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుపేద మహిళలు ఆర్థిక, సామాజిక, స్వావలంబన దిశగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేర్చడంలో విఒఎలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. నిరంతరం మహిళలకు అందుబాటులో ఉండి, ప్రతి పనిలో పాల్గొని విజయవంతం చేస్తుంటారని పేర్కొన్నారు. విఒఎలకు ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విఒఎలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇన్స్యూరెన్సు సౌకర్యం కల్పించి ఆదుకోవాలని కోరారు. జిల్లా కార్యదర్శి రంగన్న, కోశాధికారి పద్మావతి, జిల్లా సలహాదారులు రామలింగప్ప, జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్, సహాయ కార్యదర్శి భాస్కర నాయుడు, మిన్నెల్లా, మండల అధ్యక్షులు తిక్కన్న, పెద్దయ్య ఆధ్వర్యంలో నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పద్మావతి, కార్యదర్శిగా దేవన్న, కోశాధికారి నాగరత్నమ్మ, ఉపాధ్యక్షులుగా నరసప్ప రెడ్డి, ఉప కార్యదర్శిగా ఉమామహేశ్వరితో పాటు మండల గౌరవాధ్యక్షులుగా ఈశ్వర్, సలహాదారులుగా దస్తగిరిని ఎన్నుకున్నారు.
సమావేశంలో మాట్లాడుతున్న బసవరాజు










