సాలూరు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా విఒఎలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సాలూరు మండల విఒఎలు గురువారం ఎపిఎం సింహాచలంనకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల విఒఎల సంఘం నాయకులు మాట్లాడుతూ విఒఎలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, పది లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రభుత్వం చేయించాలని, కాలపరిమితి సర్కులర్ రద్దు చేయాలని, హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని కోరారు. మేజ్జింగ్ విధానం రద్దు చేయాలని, పని భారం పెరుగు తున్నందున ప్రభుత్వమే మొబైల్ అందజేయాలని. ప్రతి విఒఎకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని వెలుగు ఉద్యోగులపై పని ఒత్తిడి లేకుండా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల విఒఎ ఉద్యోగులు సంఘం ప్రతినిధులు రేణుక, మంగమ్మ, ఉషారాణి, హేమ, లావణ్య, బాలరాజు, నాగరాజు, సుందరరావు, నూకయ్య, గోపాల్, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు పాల్గొన్నారు.










