Sep 21,2023 23:21

ప్రజాశక్తి-అమలాపురం
ఎపి వెలుగు విఒఎల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం డిఆర్‌డిఎ పీడీకి వినతిపత్రం అందజేశారు. యూనియన్‌ గౌరవ అధ్యక్షురాలు కె.కృష్ణవేణి మాట్లాడుతూ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో అనేక మండలాల్లో 13 నెలలు పెండింగ్‌ వేతనాలు వేయలేదని టెక్నికల్‌ సమస్యలు పేరుతో నెలలు తరబడి పెండింగ్‌ ఉంటుందని అలాగే పాత బకాయిలే కాక విఒఎ సుమారు 7 నెలలుగా వేతనాలు రావడం లేదని జిల్లా అంతా ఏడు నెలలు వేతనాలు రాక వివోఏలు ఇబ్బంది పడుతున్నారని తక్షణం వాటిని చెల్లించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్‌ చేశారు. అలాగే లోకోస్‌ యాప్‌ లో అనేక చోట్ల గ్రూపులు మెర్జ్‌ చేశారని గ్రూపుల మెర్జ్‌ చేయడం ఆపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అలాగే నాణ్యమైన సెల్‌ ఫోన్లు ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎ. జ్యోతి జిల్లా అధ్యక్షురాలు ప్రధాన కార్యదర్శి పాము వెంకటలక్ష్మి, పి.సంతోషి, సుబ్బలక్ష్మి, జి.వరలక్ష్మి, టి. శ్రీదేవి, పి.వెంకటలక్ష్మి, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. డిమాండ్లు..1) కాలపరిమితి సర్క్యులర్‌ రద్దు చేయాలి.2) హెచ్‌.ఆర్‌ పాలసి అమలు చేయాలి. 3) రూ.10 లక్షల గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలి.4) విఓ ల మెర్జ్‌ ఆపాలి, అన్ని రకాల బకాయిలు చెల్లించాలి.5) లోకో యాప్‌ వర్క్‌ కోసం 5 జి మొబైల్‌ ప్రభుత్వమే ఇవ్వాలి.6) వాలంటీర్‌ ఐడితో విఓఎ తో పనిచేయించరాదు. విఓఎ ఐడి ద్వారా పనిచేయించాలి.7) 15 సంఘాల లోపు ఉన్న విఓఏ లకు వేతనాలు చెల్లించాలి.8) విఒఎ మెర్జ్‌ వలన ఉపాధి కోల్పోయిన విఓఏ లకు నష్ట పరిహారం ఇవ్వాలి. 9) మహిళా మార్టులలో సరుకుల కొనుగోలుకై టార్గెట్‌ ఇచ్చే పద్ధతి రద్దుచెయ్యాలి. 10) కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు, గొర్రెలు, మేకలు, కోళ్ళు , గేదెలు లాంటివి పొదుపుసంఘాల మహిళల బలవంతంగా కొనిపించే పద్ధతి ఆపాలి.