ప్రజాశక్తి - గోనెగండ్ల
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న విఒఎల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వైకెపి, విఒఎల యూనియన్ వ్యవస్థాపకులు ప్రభుదాస్ తెలిపారు. సోమవారం గోనెగండ్లలోని వెలుగు కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అతిథులుగా ప్రభుదాస్, జిల్లా అధ్యక్షులు బసవరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విఒఎలకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు హెచ్‌ఆర్ పాలసీ వర్తింపజేయాలని కోరారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సీనియర్ విఒఎలకు సిసిలుగా పదోన్నతి కల్పించాలని ప్రభుత్వానికి సిఫారసు చేశామన్నారు. వైసిపి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విఒఎలకు ప్రతినెలా గౌరవ వేతనం రావడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. అనంతరం నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆరెకల్ రవికుమార్, ఉపాధ్యక్షులుగా మిన్నెల్లాతో పాటు కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. జిల్లా కోశాధికారి పద్మావతి, కడప జిల్లా కార్యదర్శి నాగరాజు, కర్నూలు జిల్లా గౌరవ సలహాదారులు రామలింగప్ప, ఆయా మండలాల అధ్యక్ష, కార్యదర్శులు లోక్‌నాథ్ రెడ్డి, విజయ భాస్కర్, బాలస్వామి, తిక్కన్న, వరలక్ష్మి, మౌలాలి పాల్గొన్నారు.