ప్రజాశక్తి- ముంచింగిపుట్టు : కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, విఒఎలకు కాల పరిమితి నిబంధన సరికాదని సిఐటియు మండల కార్యదర్శి పాంగి భీమరాజు డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని ఇందిరా క్రాంతిపథం విఒఎలతో మండల మహిళా సమాఖ్య కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, విyఒఎ లకు కాలపరివితి సర్కిలర్ తొలగించి, వారికి నెలకు రూ.26 వేల కనీస వేతనం చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సాంకేతిక సమస్యతో ఆగిన వందలాది మంది విఒఎల వేతన బకాయి తక్షణమే చెల్లించాలన్నారు. మహిళ విఒఎలను వేధింపులు, వెట్టిచాకిరిక గురిచేయడం సరికాదన్నారు. నూతన విఒఎలను జనరల్‌బాడీ సమావేశ తీర్మానాలు లేకుండా నియామకాలు జరపటం సరికాదని మండిపడ్డారు. విపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో విఒఎలకు ఉద్యోగభద్రత, ఇతర సమస్యలపై ఇచ్చిన హామీని మూడేన్నరేళ్లుగడిచినా నెరవేర్చకపోవడం దారుణమనానరు. సెర్ప్‌లోని మహిళా సాధికారితసంస్థల్లో, గ్రామస్థాయిలో పనిచేస్తున్న విఒఎల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో విఇఎల సంఘం మండల అధ్యక్షులు రాజారావు, కార్యదర్శి జ్యోతి, లక్ష్మీపురం సర్పంచ్ కొర్ర త్రినాథ్, గిరిజన సంఘం మండల కమిటీ సభ్యుడు కొర్ర డోంమ్రు పాల్గొన్నారు.










