Sep 23,2023 22:00

చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల విఒఓల సదస్సులో మాట్లాడుతున్న వాడ గంగరాజు

10, 11 తేదీల్లో కలెక్టరేట్ల వద్ద...
విఒఎల ధర్నాను జయప్రదం చేయండి
ప్రజాశక్తి - తిరుపతి టౌన్‌
రాష్ట్రవ్యాప్తంగా వివోఏల సమస్యలపై అక్టోబర్‌ 10, 11 కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం తిరుపతి సిఐటియు కార్యాలయంలో చిత్తూరు , తిరుపతి, అన్నమయ్య జిల్లాల విఓఏ సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విఓఏల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఇచ్చిన హామీలు ఒక్కటీ అమలు చేయకుండా వారందరినీ ఇంటికి పంపించే సర్క్యులర్‌ 64 తీసుకువచ్చి మూడు సంవత్సరాలు కాలపరిమితి పెట్టడం దుర్మార్గమన్నారు. అన్ని రకాల ప్రభుత్వ పనులు చేస్తూ గొడ్డు చాకిరి చేస్తున్న వీరి సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అన్ని రకాల భారాల మీద భారాల మోపుతూ ఇబ్బందులు గురి చేస్తుంటే ఇప్పుడు వేతనాలు పెంచకుండా పని భారం పెంచడం ఏమిటని ప్రశ్నించారు. పప్పు, ఉప్పు, కారంపొడి, గింజలు, కోడిపిల్ల లు, పసుపు పొడి అమ్మాలని టార్గెట్లు పెట్టడం సిగ్గుచేటన్నారు. విఓఏలను రాజకీయ వేధింపులతో వేధించడం మానుకోవాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని, మూడు సంవత్సరాల కాలపరిమితి రద్దు చేయాలని, సంఘాల మెర్జింగ్‌ ఆపాలని తదితర ప్రధానమైన డిమాండ్ల పరిష్కారం కోసం అక్టోబర్‌ 10- 11 జరిగే ధర్నాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా విఓఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు, విఓఏల సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్‌, నాగరాజు, తిరుపతి జిల్లా నాయకులు లక్ష్మి, వేణు, అన్నమయ్య జిల్లా నాయకులు పరంజ్యోతి, కష్ణమ్మ, రాణి, రెడ్డప్ప, లతోపాటు వీవోఏలు పాల్గొన్నారు.
చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల విఒఓల సదస్సులో మాట్లాడుతున్న వాడ గంగరాజు