ప్రజాశక్తి-విజయవాడ అర్బన్: నగరంలో స్లమ్ డాగ్ హస్బెండ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఈనెల 21వ తేదీన చిత్రం విడుదల నేపథ్యంలో బందర్ రోడ్ లోని ఒక హౌటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. తొలుత నిడమానూరు లోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థులతో కలిసి చిత్ర యూనిట్ ముచ్చటించింది. హీరో హీరోయిన్ తో సెల్ఫీలు దిగేందుకు విద్యార్థులు పోటీపడ్డారు. విలేకరుల సమావేశంలో హీరో సంజరు రావు మాట్లాడుతూ స్లం డాగ్ హస్బెండ్ చిత్రం పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని, ఇందులో ఏ విధమైన అడల్ట్ కంటెంట్ ఉండదని చెప్పారు. మనుషుల కంటే జంతువులే విధేయంగా ఉంటాయి అనే పాయింట్ తీసుకొని దర్శకుడు శ్రీధర్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తీశారని తెలిపారు. ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుందని పేర్కొన్నారు. ఈ సినిమాలో నటుడు బ్రహ్మాజీ, సప్తగిరి యాదమ్మ రాజు మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయని పేర్కొన్నారు. ఈనెల 21వ తేదీన ఈ సినిమా విడుదల కానందుని ప్రేక్షకులు తమ చిన్న చిత్రాన్ని ఆదరించాలని ఆయన కోరారు. హీరోయిన్ ప్రణవి మాట్లాడుతూ స్లం డాగ్ హస్బెండ్ చిత్రం ప్రేక్షకులను కచ్చితంగా నవ్విస్తుందని ఆమె తెలిపారు. దర్శకుడు శ్రీధర్ ఈ సినిమాను పూర్తిస్థాయి వినోదాత్మకంగా చిత్రీకరించారని ఆమె చెప్పారు. స్వతంత్రం సహా నిర్మాత చింతా మేర్వాన్ మాట్లాడుతూ స్లండాగ్ హస్బెండ్ చిత్రంలో హీరో కుక్కను పెళ్లి చేసుకోవడంతో వచ్చే కష్టాలను దర్శకుడు చాలా చక్కగా చిత్రీకరించారని చెప్పారు.










