Oct 17,2023 20:24

వినియోగదారులకు వరం విద్యుత్‌ అదాలత్‌

పీలేరు : ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌ వినియోగదారులకు వరమని, దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చైర్‌ పర్సన్‌ వి.శ్రీనివాస ఆంజనేయ మూర్తి తెలిపారు. ఎపిఎస్‌పిడిసిఎల్‌ డిఇఇ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక విద్యుత్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎఇ ఎం.మునిచంద్ర మాట్లాడుతూ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అదాలత్‌కు పీలేరు మండలం నుంచి 4, కలికిరి, ఏర్రావారిపాలెం నుంచి ఒక్కొక్క సమస్యను వినియోగదారులు విద్యుత్‌ అదాలత్‌ ద ష్టికి తీసుకు వచ్చారన్నారు. నాలుగు సమస్యలను వెంటనే పరిష్కరించగా మిగిలిన రెండు సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని విద్యుత్‌ అదాలత్‌ చైర్మన్‌ తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్‌తో పాటు ఆర్థిక విభాగం సభ్యులు రామమోహన్‌ రావు, సాంకేతిక విభాగం సభ్యులు ఎస్‌ఎల్‌ అంజనీ కుమార్‌, కన్జ్యూమర్‌ అఫైర్స్‌ విభాగం సభ్యురాలు గాయం ఈశ్వరమ్మ, పీలేరు డివిజన్‌ పరిధిలోని పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, కలకడ, గుర్రంకొండ, కె.వి.పల్లి, చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాలెం మండలాలకు చెందిన విద్యుత్‌ అధికారులు, వినియోగదారులు హాజరయ్యారు.