Jun 02,2023 23:49

వినియోగదారుల వివాదాల కమిషన్‌ 2 జడ్జి వెంకటేశ్వరి

ప్రజాశక్తి- అరకు లోయ :వస్తువులు కొన్నప్పుడు మోసపోతున్న గిరిజన వినియోగదారుల రక్షణ కోసం ప్రత్యేకంగా వినియోగదారుల చట్టం అవసరమని వినియోగదారుల వివాదాల కమిషన్‌ -2 జడ్జి జి.వెంకటేశ్వరి తెలిపారు. అరకులోయ అక్షరు ఇన్‌ హౌటల్‌ లో జిల్లా వినియోగదారుల సంఘాల సమైక్య చైర్మన్‌ మర్రి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇంటెన్సిప్‌ ట్రైబల్‌ ప్రోగ్రాంలో బాగంగా వినియోగదారుల రక్షణ చట్టం 2019 పై శిక్షణ కార్యక్రమం గిరిజన వినియోగదారుల సంఘాలకు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్జి వెంకటేశ్వరి మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులు అనేకమంది మోసపోతున్నారని, ఇంటెన్సిప్‌ వాలంటీర్ల ద్వారా ఉమ్మడి జిల్లాలో చేసిన సర్వేలో వెళ్లడైందన్నారు. ఈ నివేదికలను రాష్ట్ర వినియోగదారుల వివాదాల కమిషన్‌ కు నివేదిస్తామన్నారు. గిరిజన వినియోగదారుల ప్రత్యేక చట్టం అవసరమని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ కు నివేదిస్తామని ఆమె అన్నారు.గిరిజన వినియోగదారులు నేరుగా వినియోగదారుల వివాదాల కమిషన్కు ఫిర్యాదు చేసే విధంగా ఒక ఫామ్‌ ను తయారు చేయనున్నట్లు అన్నారు. ప్రత్యేకమైన అవగాహన సదస్సులు ప్రభుత్వ అనుమతి తీసుకొని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌ యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్స్లర్‌, ప్రత్యేక అధికారి లాజపతి రారు, అరకులోయ డిప్యూటీ తహసిల్దార్‌ దొన్ను, కమిషన్‌ మెంబర్‌ రమణ బాబు, అరకు వినియోగదారుల సంగం అధ్యక్షులు సమర్ధి రఘునాధ్‌, బూర్జ లక్ష్మి, వినియోగదారుల సంఘం నాయకులు పాల్గొన్నారు.