Sep 28,2023 20:38

సబ్‌స్టేషన్‌ను పరిశీలిస్తున్న ట్రాన్స్‌కో ఎస్‌ఇ నాగేశ్వరరావు

ప్రజాశక్తి - వంగర :  జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నట్లు ఎపి ఇపిడిసిఎల్‌ ట్రాన్‌స్కో ఎస్‌ఇ ఎం. లక్ష్మణరావు అన్నారు. స్థానిక విద్యుత్తు సబ్‌ స్టేషన్‌ను ఆకస్మికంగా ఆయన గురువారం తనిఖీ చేశారు. రికార్డులు నిర్వహణ సిబ్బంది పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలకు నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు వంటి సమస్యలుంటే సిబ్బందితో తక్షణమే పరిష్కరించే చర్యలు చేపడుతున్నామన్నారు. పూర్తిస్థాయిలో విద్యుత్తు సరఫరా చేసేందుకు సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దని, సమస్యలు ఉంటే తక్షణం పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విద్యుత్తు మీటర్లుకు ఆధార అనుసంధానం చేయాలని వెల్లడించారు. గ్రామాల్లో విద్యుత్తు బకాయిలు వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్‌ ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్తు మీటర్లు మంజూరుకు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని, విద్యుత్తు బిల్లులు ఆన్‌లైన్‌లో చెల్లించుకోవచ్చునన్నారు. విద్యుత్తు సమస్యలు ఏవైనా ఉంటే 1912 కాల్‌ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఇ సురేష్‌ బాబు, ఏడి ఫణేంద్ర కుమార్‌, ఎఇ కె వినరు కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.