Oct 12,2022 22:58

డ్రా తీస్తున్న సంస్థ చైర్మన్‌ బసవరాజు, తదితరులు

పద్మపూజిత ఆటో ఫైనాన్స్‌ లక్కీడ్రా
ప్రజాశక్తి- సీతమ్మధార :
దసరా పండుగను పురస్కరించుకుని దొండపర్తిలోని పద్మ పూజిత ఆటో ఫైనాన్స్‌ సంస్థ కార్యాలయంలో లక్కీ డ్రా నిర్వహించారు ఈ సందర్భంగా పద్మ పూజిత ఆటో ఫైనాన్స్‌ సంస్థ చైర్మన్‌ బసవరాజు మాట్లాడుతూ గడచిన 20 ఏళ్లుగా పద్మపూజిత ఆటో ఫైనాన్స్‌ సంస్థ ప్రజల ఆదరభిమానాలతో దిగ్విజయంగా ముందుకు సాగిపోతోందని, లక్షలాది వాహనాలను వినియోగదారులకు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఏటా దసరా పండుగను పురస్కరించుకొని కస్టమర్లకు ఏదో రకంగా బెనిఫిట్స్‌ కల్పించే ఉద్దేశ్యంతో లక్కీడ్రా నిర్వహించి, బహుమతులను అందజేస్తున్నామన్నారు. విశాఖ నగరంలో నాణ్యమైన, మంచి కండిషన్‌ ఉన్న వాహనాలను వినియోగదారులకు అందంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, వాహన కొనుగోలుదారునికి ఏడాది వారెంటీతో మూడు సర్వీసింగ్‌లు ఉచితంగా అందిస్తున్నామన్నారు. గాజువాక ఆటోనగర్‌లో సెకండ్‌ హ్యాండ్‌ కార్ల షోరూమ్‌ ప్రారంభించామని, దానికి విశాఖ ప్రజల ఆదరణ మెండుగా ఉందన్నారు. లక్కీ డ్రా ద్వారా నలుగురికి ఎసిలు, ఐదుగురికి స్మార్ట్‌ ఫోన్స్‌, 24మందికి స్మార్ట్‌ వాచెస్‌ అందజేస్తున్నామన్నారు. పద్మపూజిత ఆటో ఫైనాన్స్‌ను ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సభ్యులు సాయిబాబు శ్రీనివాసరావు త్రినాథ్‌, వినోద్‌, సతీష్‌, సిబ్బంది పాల్గొన్నారు