ప్రజాశక్తి-విశాఖపట్నం: వినికిడి సమస్యతో బాధపడుతున్న వికలాంగులకు సహాయ పరికరాలను అందించడానికి కార్పొరేట్ పర్యావరణ బాధ్యత (సిఇఆర్) చొరవ కింద స్టీల్‌ప్లాంట్ రూ.10.57 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది. భాగవతుల చారిటబుల్ ట్రస్ట్, ఎంవిఎస్‌ఎస్ స్కూల్, అరుణోదయ స్పెషల్ స్కూల్, సన్ ఫ్లవర్ స్పెషల్ స్కూళ్లలో వినికిడి లోపం ఉన్న 118 మంది పిల్లలకు వినికిడి సహాయ పరికరాలను అందించారు. మెడ్ టెక్ జోన్‌లో సోమవారం 118 మంది పిల్లలకు హియరింగ్ ఎయిడ్ స్క్రీనింగ్, ఫిక్సేషన్ క్యాంపు నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ హెచ్‌ఆర్ సిజిఎం జి.గాంధీ, సిఎస్‌ఆర్ విభాగం ఎగ్జిక్యూటివ్‌లు, డాక్టర్ జితేంద్రశర్మ, ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్‌కు చెందిన డివిజనల్ హెడ్‌లు, శాస్త్రవేత్తలు, వైద్య బృందం, నాలుగు విద్యా సంస్థల అధిపతులు శిబిరానికి హాజరై పిల్లలు, తల్లిదండ్రులతో సంభాషించారు.