Sep 14,2023 19:50

మాట్లాడుతున్న సిఐ

మాట్లాడుతున్న సిఐ
వినాయక విగ్రహాల ఏర్పాటుకు
అనుమతులు తప్పనిసరి
ప్రజాశక్తి-కోవూరు :మండలంలోని అన్ని పంచాయతీలలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సిఐ రామకృష్ణ, ఎస్‌ఐ రంగనాథ్‌గౌడ్‌ తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా సిఐ మాట్లాడుతూ మండల పరిధిలోని 10 పంచాయతీల్లోని అన్ని గ్రామాల్లో వినాయక విగ్రహాలు పందిళ్ళు, మండపాలు మైకులు ప్రోగ్రామ్స్‌ మొదలగునవి ఏర్పాటు చేసుకునే వారు ఉత్సవ నిర్వాహకులు తప్పని సరిగా ముందస్తు పోలీసు అనుమతి పొందాలని తెలిపారు. పోలీస్‌ సేవా కేంద్రంలో దరఖాస్తులు కమిటీలు వివరాలతో అందజేయాలన్నారు.
ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కేంద్రం పనిచేస్తుందన్నారు. ఉత్సవ నిర్వాహకులు, మండపాలు ఏర్పాటు చేసేవారు కచ్చితంగా పోలీసుల అనుమతుల కోసం వారు అందించే నమూనా దరఖాస్తుపై ఉత్సవ కమిటీ పేరు, విగ్రహం పెట్టే ప్రదేశం, తేదీ, విగ్రహం ఎత్తు, నిమజ్జనం చేసే తేదీ, ఊరేగింపు చేసే తేదీ, నిమజ్జనం చేసే ప్రదేశం అందులో స్పష్టంగా నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ స్థలంలో స్థానిక సచివాలయంలో ప్రయివేటు స్థలమైతే యజమాని నుంచి అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఎక్కడ కూడా బలవంతపు చందాలు వసూలు చేయరాదన్నారు. విగ్రహాన్ని ఉంచేందుకు పటిష్టమైన వేదికను ఏర్పాటు చేసుకోవాలని, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎటువంటి ఘర్షణలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బాక్స్‌ టైప్‌ స్పీకర్లు మాత్రమే వినియోగించాలని రాత్రి సమయంలో మండపం వద్ద తప్పనిసరిగా కమిటీ సభ్యులు కాపలా ఉండాలన్నారు. అనుమతులు లేకుండా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై తగిన కఠినమైన చర్యలు చేపడతామని తెలిపారు.