Oct 01,2023 21:23

కాంతారా వేషధారణ చుట్టూ చెలరేగిన మంటలు

ఎర్రగుంట్ల : పట్టణ పరిధిలోని నడివూరు వినాయక నిమజ్జనంలో అపశతి చోటు చేస్తుంది. వివరాలు.. శనివారం రాత్రి నగర పంచాయతీ పరిధిలోని నడివూరు వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా కాంతారా సినిమా వేషధారణ నృత్యాన్ని వినాయక కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. నత్యాన్ని వీక్షించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. నత్యం వ్యక్తి చుట్టూ పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టి మధ్యలో నత్యం చేసేలా ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టే సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో చుట్టూ ఉన్న ప్రజలు పరుగులు తీశారు. ఈ క్రమంలో అక్కడున్న ఆరుగురికి మంటలు వ్యాపించాయి. అందులో నలుగురి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన చందు , హేమ శ్రీ , చైతన్య , సూరిని వెంటనే ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. వీరిలో చందు, హేమశ్రీ, చైతన్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరిలో ముగ్గురు చిన్నారులున్నాయి. వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పోలీసుల భద్రత వైఫల్యంతోనే ఘటన జరిగిందని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. అనుమతులు లేకున్నా డిజెలతో శబ్ద కాలుష్యాన్ని సష్టిస్తున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన కమిటీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి ఘటనలు పునరావతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పలువురు కోరుతున్నారు.