Sep 21,2023 21:35

సమావేశంలో మాట్లాడుతున్నఎస్పీ

ప్రజాశక్తి-హిందూపురం : పట్టణంలో 24వ తేది ఆదివారం జరిగే వినాయక నిమజ్జనాకి అవసరమైన అన్ని భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎస్‌పి మాధవ రెడ్డి అన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని పట్టణంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న గణేష్‌ ఉత్సవ కమిటీలతో పాటు సర్వమత పెద్దలతో గురువారం వన్‌ టౌన్‌బ స్టేషన్‌లో సర్వమత శాంతి సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్‌పితో పాటు డిఎస్‌పి కంజాక్షన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌, తహశీల్దార్‌ హసీనా సుల్తాన, ట్రాన్స్‌ కో డీఈఈ భూపతి, వైస్‌ చైర్మేన్లు జబివుల్లా, బలరామిరెడ్డి, మాజీ ఎమ్మేల్యే అబ్దుల్‌ ఘనీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పలువురు ఉత్పవ కమిటీ నిర్వహకులు, ముస్లీం మత పెద్దలు, ముత్వల్లీలు పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా ఎస్‌పి మాట్లాడుతు వినాయక విగ్రహ ఊరేగింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.