Sep 19,2023 20:13

వినాయక నిమజ్జనం నేపథ్యంలో కమిషనర్‌ చెరువు పరిశీలన

వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి : కమిషనర్‌
ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌
వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేశామని నగరపాలక సంస్థ కమిషనర్‌ హరిత అన్నారు. కరకంబాడి మార్గంలోని వినాయక సాగర్‌ లో చేసిన నిమజ్జన ఏర్పాట్లను మంగళవారం ఇంజినీరింగ్‌ అధికారులతో కలసి కమిషనర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేశామన్నారు. విగ్రహాలను తీసుకు వచ్చే భక్తులు నగరపాలక సంస్థ సిబ్బందికి సహకరించాలని అన్నారు. అందరూ గుంపులు గుంపులుగా రాకుండా ఒక క్రమ పద్ధతిలో విగ్రహాలను తీసుకు రావాలన్నారు. విగ్రహాలతో తీసుకు వచ్చిన ఆకులు, చెరుకు గడలు వంటివి నీళ్లలో వేయకుండా తమ సిబ్బందికి అందించాలన్నారు. ఎక్కడపడితే అక్కడ విగ్రహాలు వేయరాదన్నారు. విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని ఉంచామని వారికి విగ్రహాలు అందించాలని అన్నారు. తెప్పలమీద పరిమితికి మించి ఎక్కకుండా తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు..వినాయక సాగర్‌ వద్ద నిమజ్జనం సమయంలో చెరువు సమీపంలోకి చిన్న పిల్లలను పంపకుండా , మండప నిర్వాహకులు, తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వినాయక సాగర్లో జరుగుతున్న అభివద్ధి పనులను పరిశీలించారు. ఓపెన్‌ జిమ్‌ ప్రాంతాన్ని పరిశీలించారు.. కమిషనర్‌ వెంట మునిసిపల్‌ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌ ఉన్నారు.
వినాయక నిమజ్జనం నేపథ్యంలో కమిషనర్‌ చెరువు పరిశీలన