Sep 16,2023 00:37

ప్రజశక్తి - చీరాల
వినాయక చవితి పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డిఎస్‌పి ప్రసాదరావు అన్నారు. స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో శుక్రవారం మాట్లాడారు. వినాయక చవితి పండుగకు విగ్రహాలను ఏర్పాటు చేసుకునే వాళ్లు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. ప్రతి విగ్రహనికి కమిటీ ఏర్పాటు చేసుకుని, కమిటీ వివరాలను స్టేషన్లో అందించాలని కోరారు. గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలని అన్నారు. నిమజ్జనం పూర్తి అయ్యేవరకు కమిటీ బాధ్యత వహించాలని అన్నారు. సమావేశంలో వన్ టౌన్ ఇంచార్జి సిఐ సోమశేఖర్, రూరల్ సీఐ మల్లికార్జునరావు ఉన్నారు.