ప్రజాశక్తి - పోలవరం
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలందించే సంకల్పంతో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిందని, వినూత్నమైన మార్పులు తీసుకొచ్చిందని ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు అన్నారు. మండలంలో వింజరం పంచాయతీ గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. సచివాలయంలో నిర్మించిన అన్ని గదులను పరిశీలించారు. అనంతరం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ ఆదేశాలను, నియమాలను అందరూ తప్పకుండా అనుసరించాలని, సేవల్లో పారదర్శకత పాటించి ప్రజలకు సకాలంలో పనులు చేయాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వింజరం పంచాయతీ ప్రెసిడెంట్ కె.వెంకటలక్ష్మి, పోలవరం ఎంపిపి సుంకర వెంకటరెడ్డి, జెడ్‌పిటిసి సభ్యులు కలుం హేమకుమారి, వైస్ ఎంపిపి మీడియం సింగరాజు, వైసిసి మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ, పోలవరం పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ కోరసిక శ్రీను, ఇటుకలకోట ఎంపిటిసి మాజీ సభ్యులు గంగాచలం పాల్గొన్నారు.










