విమ్స్ సిబ్బందికి వ్యాక్సిన్ వేస్తున్న తోటి సిబ్బంది
ప్రజాశక్తి -అరిలోవ : విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (విమ్స్) వైద్య సిబ్బందికి హెపటైటిస్ 'బి' వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్ శనివారం విజయవంతంగా నిర్వహించారు. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించిన విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు మాట్లాడుతూ, ఆసుపత్రికి వివిధ రకాల రోగులు వస్తున్న నేపథ్యంలో సిబ్బందికి హెపటైటిస్ బి వైరస్ సోకకుండా రక్షణకు వ్యాక్సినేషన్ చేయిస్తున్నామన్నారు. కెజిహెచ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం సహకారంతో ఆసుపత్రిలోని సుమారు నాలుగు వందల మంది సిబ్బందికి వ్యాక్సినేషన్ చేశామన్నారు కార్యక్రమంలో కెజిహెచ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ గిరినాథ్, విమ్స్ ఆర్‌ఎంఒ డాక్టర్ హరికృష్ణ పాల్గొన్నారు.










