విమానాశ్రయంలో 'శ్రీవాణి' టికెట్ కౌంటర్ ప్రారంభం
ప్రజాశక్తి-రేణిగుంట
రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులకు కరెంటు బుకింగ్‌లో శ్రీవారి దర్శన టిక్కెట్లు అందుబాటులో ఉండేలా శ్రీవాణి ట్రస్టు కౌంటర్ ఏర్పాటు చేసింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. గురువారం టీటీడీ జేఈవో వీరబ్రహ్మం చేతుల మీదుగా కౌంటర్ ప్రారంభించారు. తిరుపతి విమానాశ్రయ అభివద్ధి కమిటీ ఛైర్మన్‌గా విమానాశ్రయ అభివద్ధికి శ్రమిస్తున్న ఎంపీ గురుమూర్తి గతంలో ఈ విషయాన్ని టీటీడీ ఛైర్మన్, అధికారుల దష్టికి తీసుకెళ్లారు. శ్రీవాణి ట్రస్టు కరెంటు బుకింగ్ కౌంటర్ విమానాశ్రయంలో ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు అప్పటికప్పుడు దర్శనం చేసుకొనేందుకు టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని.. తద్వారా విమానాశ్రయంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుందన్నారు. కౌంటర్ ఏర్పాటుకు సహకరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎయిర్పోర్ట్ డీజీఎం టెర్మినల్ చంద్రకాంత్, కమర్షియల్ మేనేజర్ అవినాష్, టెర్మినల్ మేనేజర్ మణిదీప్, టీటీడీ ఐటీ విభాగం ఎం సందీప్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.










