బాలల వారోత్సవాల ముగింపులో మాట్లాడుతున్న సీనియర్ సివిల్ జడ్జి బులికృష్ణ
ప్రజాశక్తి - ఆరిలోవ : బాలలకు విలువలతో కూడి విద్యను అందించి సమాజం మెచ్చే పౌరునిగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని సీనియర్ సివిల్ జడ్జి కెకెవి.బులికృష్ణ అన్నారు. బాలల వారోత్సవాల ముగింపు కార్యక్రమం దీనదయాల్‌పురంలోని ప్రభుత్వ బాలుర గృహంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి బులికృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు చెప్పినట్టు విని, పరివర్తన చెందిన మనస్సుతో బాలలు తిరిగి వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యుసి చైర్మన్ ఎం.రామలకీëరాధ, పిఆర్‌ఎస్ రాజు, జి.వెంకటరమణారెడ్డి, బాలుర గృహం పర్యవేక్షణాధికారి వీరయ్య, సిబ్ల్యుసి సభ్యులు పాల్గొన్నారు.










