విలీన నాలుగు మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ధర్నా

ప్రజాశక్తి-చింతూరు
పోలవరం విలీన చింతూరు, విఆర్.పురం, కూనవరం, ఎటపాక నాలుగు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి నష్టపోయిన పంటను సర్వే చేసి వెంటనే పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, ప్రజలు సోమవారం స్థానిక ఐటిడిఎ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ విలీన నాలుగు మండలాల్లో రైతులు వేసుకున్న వరి, మిర్చి, పొగాకు, పత్తి పంటలు మొత్తం వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయాయని, వాటికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. అనంతరం ఐటిడిఏ పిఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విఆర్.పురం ఎంపీపీ కారం లక్ష్మి, కూనవరం వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య, సర్పంచులు పూనెం సరోజిని, కారం బుచ్చమ్మ, సవలం మారయ్య, వెంకమ్మ, శంకర్, ఎంపీటీసీలు అమ్మాజీ, జయసుధ, ముర్రం లక్ష్మి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మేకల నాగేశ్వరరావు, పల్లపు వెంకట్, పాయం సీతారామయ్య, నాయకులు కర్నాటి శ్రీనివాస్, నాగరాజు, బాబురావు, రమేష్, పిడగయ్య, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
రైతులకు నష్టపరిహారం చెల్లించాలి
వర్షాల్లేక పంటలు ఎండిపోయిన పంటలను సర్వే చేసి నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని సిపిఎం తులసిపాక శాఖ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం మండల కమిటీ సభ్యులు మడకం చిన్నయ్య, గ్రామ శాఖ కార్యదర్శి కలుముల ముత్తయ్య ఆధ్వర్యంలో సిపిఎం బృందం గ్రామంలో ఎండిపోయిన పంటలను పరిశీలించి మీడియాకు తెలియజేశారు. గ్రామంలో గిరిజన రైతులు వేసుకున్న పంటలు మొత్తం వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయాయని తెలిపారు. జగన్ ప్రభుత్వం ఇచ్చే నాలుగు నెలల పంట విత్తనాలు వల్ల పంట చేతికి రావడం లేదన్నారు. పూర్తిగా వర్షాలపై ఆధారపడి వేస్తున్న ఈ ప్రాంత వాసులకు మూడు నెలలకు వచ్చే పంట విత్తనాలను అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోడియం అప్పారావు, కలుముల లక్ష్మయ్య, సవలం రామయ్య, సవలం దుర్గారావు, సవలం లక్ష్మరు తదితరులు పాల్గొన్నారు.