ప్రజాశక్తి - ఆగిరిపల్లి
ప్రజాశక్తి చాట్రాయి మండల విలేకరి ఆడిమెల్లి లాజర్‌కు మాతృ వియోగం జరిగింది. ఆయన తల్లి ఆడిమెల్లి వెంకమ్మ(70) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ గురువారం మండలంలోని జనార్ధన వరంలోని ఆమె స్వగృహంలో మృతి చెందారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమారైలు ఉన్నారు. ఆమె మృతదేహాన్ని పలు గ్రామాల సర్పంచులు, ఎంపిటిసి సభ్యులు, పలు పార్టీల నాయకులు సందర్శించి నివాళులర్పించారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెంకమ్మ మృతి పట్ల ప్రజాశక్తి రాజమండ్రి ఎడిషన్ మేనేజర్ డి.శ్రీనివాస్, జిల్లా డెస్క్ ఇన్‌ఛార్జి విఎస్‌ఎస్‌వి.ప్రసాద్, స్టాఫ్ రిపోర్టర్ పి.గంగరాజు, జిల్లా బాధ్యులు పి.నారాయణరాజు, వై.సీతారాం సంతాపం తెలిపారు.










